KTR: రేవంత్.. నువ్వు మగాడివైతే.. నీకు దమ్ముంటే.. ఆ పని చెయ్
KTR: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఆరుగురు BRS ఎమ్మెల్యేలను తీసుకున్నారని.. రేవంత్ నిజంగా మగాడైతే.. దమ్ముంటే ఆ ఆరుగురి చేత రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని డిమాండ్ చేసారు. అప్పుడు వారికి ప్రజలు ఓట్లతో కొట్టి వారిని శాశ్వతంగా రాజీకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదని అన్నారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై కేటీఆర్ స్పందిస్తూ.. గడ్డి పోచ లాంటి నాయకుడు మాత్రమే పోయాడని సెటైర్ వేసారు. జగిత్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు.