KTR: ఉగ్గాని అంటే ఏంటి..?

ద‌సరా కానుకగా తెలంగాణ సీఎం KCR ప్ర‌క‌టించిన‌ బ్రేక్ ఫాస్ట్ స్కీం (breakfast scheme) ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని పిల్ల‌ల‌కు ఏ రోజు ఏ ఆహారం పెడుతున్నారో మంత్రి KTR వివ‌రిస్తూ.. ఉగ్గాని అనే పదాన్ని చూసి అంటే ఏంటి అని అక్క‌డున్న అధికారుల‌ను అడిగారు. ఇది మ‌న ఫుడ్ కాదా? అని అడ‌గ్గా.. అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి రాయ‌ల‌సీమ‌లో ఫేమ‌స్ అని చెప్పారు. దీనికి KTR బ‌దులుగా ఓహో.. నాకు తెలీదు అని న‌వ్వుకున్నారు. ఆ కార్య‌క్ర‌మంలో పిల్ల‌ల‌కు KTR స్వ‌యంగా వ‌డ్డించి వారితో క‌లిసి టిఫిన్ చేసారు.