ఓటమిని ఒప్పుకున్న KTR
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. లోక్ సభ ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితి చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకే చాలా మటుకు సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో తాను ఓటమిని ఒప్పుకుంటున్నట్లు బాధపడుతూ కేటీఆర్ ట్వీట్ చేసారు.
“” తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 24 ఏళ్లలో ఎత్తుపల్లాలన్నీ చూసింది. ఎన్నో అద్భుత విజయాల నుంచి పరాజయాలను చూసింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే మా అతిపెద్ద విజయంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఓ ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు మంచి మెజారిటీతో గెలిచాం. మూడోసారి ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచాం. ఇక ఈరోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరింత బాధించాయి. మళ్లీ లేచి నిలబడి విజయంగా తిరిగొస్తాం “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు