Kranthi Kiran: కాంగ్రెస్‌కి BRS ఎమ్మెల్యే స్మూత్ వార్నింగ్
Hyderabad: విద్యుత్ వ్యవస్థపై BRS ప్రభుత్వం దారుణాలకు పాల్పడింది అంటూ TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy), ఇతర కాంగ్రెస్ (congress) పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై BRS ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ (kranthi kiran) మండిపడ్డారు. ఏది పడితే అది వాగితే ఫ్యూజులు ఎగురుతాయ్ అంటూ స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చారు. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్‌కి ఉన్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలను బట్టే అర్థమవుతోందని అన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే కరెంటు సమస్య అని తెలంగాణ రైతుల మెడపై కత్తి పెట్టి కరెంటు చార్జీలు వసూలు చేయాలని నాటి చంద్రబాబు (chandrababu naidu) ప్రభుత్వం జారీచేసిన హుకుంను తెలంగాణ రైతాంగం వ్యతిరేకించిందని తెలిపారు. అయినా వినని చంద్రబాబు నిరంకుశ ప్రభుత్వానికి తెలంగాణ వ్యతిరేకంగా ఉద్యమించిందని ఆ సమయంలో ఉద్యమకారులపై బుల్లెట్ల వర్షం కురిపించింది చంద్రబాబు ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పుట్టిందే TRS (BRS) పార్టీ అంటూ క్రాంతి కిరణ్ (kranthi kiran) కాంగ్రెస్‌పై మండిపడ్డారు.