Kotha Prabhakar Reddy పై క‌త్తితో దాడి..వీడియో వైరల్!

Telangana Elections: మెదక్ BRS ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (kotha prabhakar reddy) మీద కత్తితో దాడి చేసారు. సిద్ధిపేట‌ జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌భాక‌ర్‌పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కత్తితో దాడి చేసాడు. ప్రభాకర్ రెడ్డికి కడుపులో తీవ్ర గాయం అవ్వ‌డంతో ఆస్పత్రికి తరలించారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని ప‌ట్టుకుని కార్య‌క‌ర్త‌లు చిత‌క‌బాదారు. అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు.