Kota Neelima: గుర్తుప‌ట్ట‌ని ప్ర‌జ‌లు.. కోపంతో వెనుదిరిగిన కాంగ్రెస్ అభ్య‌ర్ధి

Kota Neelima: సనత్ నగర్ కాంగ్రెస్ (congress) అభ్యర్థి కోట నీలిమకు వింత ఘ‌ట‌న ఎదురైంది. ప్ర‌చారానికి వెళ్లిన కోట నీలిమ‌ను చూసి ప్ర‌జ‌లు గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డంతో ఆమె అవాక్క‌య్యారు. స్థానికులు గుర్తుపట్టే ఒక బూత్ కమిటీ సభ్యుడు కూడా లేకపోవడంతో స్థానిక నాయకులపై ఆగ్రహం వ్య‌క్తం చేసారు. చివరికి ప్రచారాన్ని రద్దు చేసుకొని వెళ్లిపోయారు.