మంత్రి పదవి ఔట్? మరో బీసీకి అవకాశం
Konda Surekha: అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లింక్ పెడుతూ సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. కొండా సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.