స‌మంత‌, చైత‌న్యపై కామెంట్స్.. ఇండ‌స్ట్రీలో వారే నాకు చెప్పారు

Konda Surekha says nobody knows the truth behind samantha naga chaitanya divorce

Konda Surekha: సినీ న‌టులు అక్కినేని నాగచైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసాయి. సినీ హీరోలు, హీరోయిన్లు అంతా దీనిని సోష‌ల్ మీడియా ద్వారా ఖండిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున కొండా సురేఖ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసారు. ఈ అంశంపై ఆల్రెడీ కొండా సురేఖ ట్విట‌ర్ ద్వారా స్పందిస్తూ స‌మంత‌కు సారీ చెప్పారు. తాను స‌మంత పేరును వ్య‌క్తిత్వ హ‌న‌నం కోసం తీయ‌లేద‌ని.. కేటీఆర్‌కు ఆడ‌వాళ్ల ప‌ట్ల ఎలాంటి చిన్న చూపుందో తెలియ‌జేసేందుకు పొర‌పాటున స‌మంత పేరు బ‌య‌టికి వ‌చ్చింద‌ని అన్నారు.

అయితే ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఓ షాకింగ్ కామెంట్ చేసారు. “” స‌మంత‌, నాగ‌చైత‌న్య ఎందుకు విడిపోయారో ఇప్ప‌టికీ ఎవ్వ‌రికీ తెలీదు. ఈ విష‌యాన్ని వాళ్లు కూడా బ‌య‌టికి చెప్ప‌లేదు. నేను చేసిన వ్యాఖ్య‌లు నా సొంత వ్యాఖ్య‌లు కావు, నాకు ఇండ‌స్ట్రీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల నుంచి స‌మాచారంతోనే ఆ వ్యాఖ్య‌లు చేసాను. నేను చెప్పిన కారణం అబ‌ద్ధ‌మైతే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ ఎందుకు విడిపోయారో నాగార్జున చెప్పాలి. నేను కోపంలో ఏదేదో వాగేసాను కానీ నేను చెప్పిన‌వ‌న్నీ వాస్త‌వాలే. నేను ఏదీ దాచ‌లేదు. కేటీఆర్‌ని వదిలే ప్ర‌స‌క్తే లేదు “” అని వెల్ల‌డించారు.