Konda Surekha Lawyer: బిగ్‌బాస్‌లో ఒకరి మీద ఒకరు పడుకుంటారు
Konda Surekha Lawyer: అక్కినేని నాగార్జున .. మంత్రి కొండా సురేఖ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతోంది. నాగార్జున కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున రూ.100 కోట్ల దావాతో పాటు కేసు కూడా వేసారు. ఈ రోజు ఈ కేసులో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తరఫు లాయర్ మ్యాటర్‌ను కులం వైపు డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.
సురేఖ ఓ బీసీ మహిళ అని.. ఆమెపై కేసు వేసారు కాబట్టి నాగార్జునపై కూడా కేసు వేస్తామని వితండవాదం చేస్తున్నారు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఒక చెత్త షో అని.. అందులో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పడుకుంటారని.. ఇలాంటి షోలు వేసి దేశానికి, సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సురేఖ లాయర్ ప్రశ్నించారు. సురేఖ క్షమాపణలు చెప్పాక కూడా నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు అని అన్నారు. నాగార్జుతో పాటు ఆయనకు మద్దతు తెలిపినవారందరిపై కేసులు వేస్తామని అన్నారు.