“కొండా సురేఖ పడుకో అనే మాట అనలేదు కదా”
Konda Surekha: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గురించి సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేసారు. నిన్న నాంపల్లి కోర్టులో ఆయన తన వాంగ్మూలాన్ని కూడా వినిపించారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కంటే ఆమె తరఫు లాయర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సురేఖ తరఫున ఇద్దరు లాయర్లు ఈ కేసును వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ మహిళా లాయర్ సురేఖ తరఫున మాట్లాడుతూ.. “” అసలు సురేఖ ఏమన్నారండీ? ఆమె ఏమన్నా పడుకో అనే పదజాలం వాడారా? మరి ఇందులో అసభ్యకరమైన పదజాలం ఎక్కడుంది? సినీ పరిశ్రమ గురించి 24 క్రాఫ్ట్స్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ కావాలనే చేస్తున్నారు అని వ్యాఖ్యానించే క్రమంలో కొండా సురేఖ సమంత పేరు తీసారు. దాంతో సమంత ఈగో హర్ట్ అయ్యి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం వల్ల సురేఖ సారీ కూడా చెప్పారు. కచ్చితంగా సురేఖ నిర్దోషిగా బయటికి వస్తారు. ఈ కేసు నిలబడదు “” అని తెలిపారు.