Konda Surekha: సారీ సమంత
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఎన్టీఆర్, నాని వంటి స్టార్ నటీనటులు ఈ అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఇంత నీచానికి దిగజారాలా అని ప్రశ్నిస్తున్నారు. సమంత, నాగచైతన్యలు కూడా ఈ అంశంపై స్పందిస్తూ తమని రాజకీయాల్లోకి లాగొద్దని వేడుకున్నారు. ఈ అంశం తుఫానుగా మారక ముందే సురేఖ ట్విటర్ వేదికగా సమంతకు క్షమాపణలు చెప్పారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా.. సారీ సమంత అంటూ కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండస్ట్రీలో రకుల్, సమంత లాంటి ఎందరో నటీనటుల ఫోన్లు ట్యాప్ చేసారని.. దాని వల్ల నాగచైతన్య, సమంత విడిపోయారని.. రకుల్ లాంటి ఇంకొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని షాకింగ్ ఆరోపణలు చేసారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖపై ధ్వజమెత్తింది.