Venkat Reddy: అరికెపూడి గాంధీ BRS నేతే
Venkat Reddy: అరికెపూడి గాంధీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతే అని అన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చచ్చిన BRS పార్టీని బ్రతికించడం కోసం డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము తలుచుకుంటే BRS ఉండేదా?? BRS నాయకులను రోడ్ల మీద తిరగనివ్వం అని హెచ్చరించారు. అరికెపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డి మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో BRS పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కవ్వించాలని చూస్తారని కాంగ్రెస్ శ్రేణులు అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.