Komatireddy: రేవంత్‌ని తిడితే హైకమాండ్‌ని తిట్టినట్లే
TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని (revanth reddy) తిడితే అది నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌ని తిట్టినట్లే అని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy). జనగామ టికెట్ ఇవ్వనందుకు ఇటవల ఆ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య (ponnala lakshmaiah) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు.. తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయనే రాజీనామా చేస్తున్నారని లక్ష్మయ్య అన్నారు. దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్ల పాటు రకరకాల పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే కాకుండా ఆ పార్టీ నేతల గురించి తప్పుగా మాట్లాడటం తప్పని అన్నారు. నీడనివ్వడం లేదని చెట్టును నరుక్కున్నట్లు.. జనగామ టికెట్ కాకపోతే ఇంకా పదవులు ఉన్నాయి కదా అని అన్నారు.