Komatireddy Venkat Reddy: KCR, KTRలు హిట్ల‌ర్ తాత‌లు

తెలంగాణ సీఎం KCR, ఐటీ శాఖ మంత్రి KTR హిట్ల‌ర్ తాతల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు న‌ల్గొండ స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (komatireddy venkat reddy). తెలంగాణ ఎన్నిక‌ల (telangana elections) ప్రచార కార్య‌క్ర‌మంలో కేవ‌లం కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావులే పాల్గొంటున్నార‌ని మిగ‌తా మంత్రుల‌కు అస‌లు అవ‌కాశం ఇవ్వ‌డంలేద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో BRSది ఎమ‌ర్జెన్సీ పాల‌న అని మండిప‌డ్డారు.

KCR మాట్లాడితే కారు కావాలా బేకారు కావాలా అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బ‌తీయాల‌ని BRS, BJP, AIMIMలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపణ‌లు చేసారు. క‌చ్చితంగా ఈసారి కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. KCR మాట్లాడితే ప్ర‌జ‌లు మౌనంగా వింటూ ఉంటార‌ని.. అదే రాహుల్ గాంధీ (rahul gandhi) మాట్లాడితే లేచి మ‌రీ చ‌ప్ప‌ట్లు కొడుతున్నార‌ని తెలిపారు.