Komatireddy: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం.. అందుకే బిల్లుకు ఆమోదం తెలపలేదు
పార్లమెంటు సమావేశాలకు వస్తున్నప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు (women’s reservation bill) ఓటు వేయలేక పోయామని వెటకారంగా సమాధానం చెప్పారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy). మొన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు ఆమోదం తెలిపారు కానీ కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు మాత్రం ఆమోదం తెలపకుండానే వాకౌట్ చేసారు. ఎందుకు ఆమోదం తెలపలేదు సర్ అని అడిగితే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామని అసలు ఆరోజు పార్లమెంట్‌కు వెళ్లనేలేదని అన్నారు. బిల్లుకు ఆమోదం తెలపని పార్టీల్లో AIMIM కూడా ఉంది.