Kolikapudi Srinivasa Rao: ABN రిపోర్ట‌ర్‌కి TDP ఎమ్మెల్యే వార్నింగ్

Kolikapudi Srinivasa Rao warning to abn reporter

 

Kolikapudi Srinivasa Rao:  ABN ఆంధ్ర‌జ్యోతి విలేక‌రికి.. తిరువూరిక చెందిన తెలుగు దేశం పార్టీ నేత కొలిక‌పూడి శ్రీనివాస రావు వార్నింగ్ ఇచ్చారు. తిరువూరులో ఎంత అభివృద్ధి జ‌రుగుతున్నా త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తున్నార‌ని.. తిరువూరులో అస‌లు అభివృద్ధే క‌నిపించ‌డంలేద‌ని రాసేస్తున్నార‌ని అన్నారు. ఆ రిపోర్ట‌ర్ ఎవ‌రో త‌న‌తో పాటు వ‌స్తే ఎంత అభివృద్ధి చేస్తున్నానో చూపిస్తాన‌ని అన్నారు. తాను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని.. ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేద‌ని.. ఆ రిపోర్ట‌ర్ త‌న వెంట్రుక కూడా పీక‌లేడంటూ రెచ్చిపోయారు. తన ద‌యాదాక్షిణ్యాల‌తోనే ఆ రిపోర్ట‌ర్ తిరువూరులో ప్రాణాల‌తో తిరుగుతున్నాడ‌ని.. తాను త‌లుచుకుంటే అత‌ను అస‌లు రోడ్ల‌పై క‌నిపించ‌డు అంటూ రెచ్చిపోయారు.