kodi kathi case: నేడే ఫైనల్ జడ్జ్మెంట్!
vijayawada: ఏపీలో ఒకవైపు వివేకా హత్య కేసు(viveka muder case) విచారణ.. మరోవైపు కోడి కత్తి(Kodi Kathi Case) కేసు ఎన్ఐఏ కోర్టు(NIA Court)లో కీలక విచారణ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఇక వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ మరో చిన్నాన్న భాస్కర్‌రెడ్డిని నిన్న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ.. ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash reddy)ని కూడా సీబీఐ(cbi) వారు విచారించనున్నారు. కోడి కత్తి కేసులో నేడు కీలక తీర్పు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీను(srinu) గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఎన్ఐఏ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు జగన్ తరపు న్యాయవాది.. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టాలని కోరుతుండగా.. నిందితుడి తరపు న్యాయవాది మాత్రం.. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చాలా ఆలస్యం అయ్యిందని.. తీర్పు త్వరితగతిన వెల్లడించాలని కోరుతున్నారు. కేసు విచారణ కీలక దశకు చేరుకోవడం.. ఎన్ఐఏ నిందితుడి స్టేట్మెంట్ను గత వాయిదాలు కోర్టుకు సమర్పించడం.. అవి మరోసారి సంచలనం కావడంతో ఇప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్‌ను తన వాదనలను కోర్టుకు వచ్చి వినిపించాలని జడ్జి గతంలోనే ఆదేశించారు. అయితే.. తాను వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని జగన్ వివరణ ఇచ్చారు. కావాలంటే.. వీడియో రూపంలో తన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవాలని తెలిపారు. మరోవైపు ఈ నెల 13న కేసు విచారణకు రాగా.. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కౌంటర్ అధ్యయనానికి రెండు రోజుల సమయం కోరారు. దీంతో విచారణను ఎన్ఐఏ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు వాదనలు వినిపించాలని .. అదేరోజు హియరింగ్ విని ఆర్డర్ ఇస్తానని న్యాయమూర్తి అన్నారు. ఈక్రమంలో ఇవాళ న్యాయమూర్తి ఏవిధంగా తీర్పు ఇస్తారో చూడాలి.