Kodali Nani: పవన్ బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం
AP: YSRCP నేత కొడాలి నాని (kodali nani) జనసేనాని పవన్ కళ్యాణ్‌పై (pawan kalyan) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. TDP అధినేత చంద్రబాబు పవన్‌ను ఎలా వాడుకుంటున్నారో వివరించారు. “” నిన్ను వాడుకుంటున్నాడు. వెన్నుపోటు పొడుస్తాడు. అవసరానికి వాడుకోవడం తర్వాత తీసి పక్కనపెట్టేయడం అనేది చంద్రబాబు రక్తంలోనే ఉంది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఈ వెదవను పార్టీలో పెట్టుకుని రాజకీయంగా పునర్జమ్మను ఇచ్చారు. అలాంటి రామారావుగారినే మెడపట్టి బయటకు గెంటేసాడు. ఆయన పార్టీని, ముఖ్యమంత్రి 420 ఈ చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో పవన్ కలిస్తే ఆయనకు కూడా ఇలాంటి గతే పడుతుంది. ఈ రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు లాంటి వెదవలంతా కలిసి పవన్‌కి కూడా అదే గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రా. 24 గంటలు తిరుగు ప్రజల్లో మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఎత్తి చూపు మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడుతో కలిసి మా పార్టీని కానీ జగన్ అన్నను కానీ ఏమన్నా అంటే మాత్రం ఊరుకోం. పవన్ చంద్రబాబుతో కలిసి మాపై విమర్శలు చేస్తే మాత్రం పవన్ బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడతాం “” అంటూ వార్నింగ్ ఇచ్చారు నాని.