Kodali Nani: TDP ప‌గ్గాలు ఎన్టీఆర్‌కి రావాలంటే చంద్ర‌బాబు ఓడిపోవాలి

Kodali Nani uses jr ntr for his campaign

Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ గుడివాడ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి కొడాలి నాని.. ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు వాడుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గుడివాడ‌లో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసిన కొడాలి నాని తెలుగు దేశం పార్టీని జ‌న‌సేన‌ను విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ప‌గ్గాలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి రావాలంటే.. రేపు జ‌ర‌గబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు చిత్తుగా ఓడిపోవాల‌ని అన్నారు. చంద్ర‌బాబుకి వ‌య‌సు అయిపోయింది కాబ‌ట్టి.. ఆయ‌న త‌ర్వాత నారా లోకేష్‌కు పార్టీని నిలబట్టే సీన్ లేదు కాబ‌ట్టి చ‌చ్చిన‌ట్లు పార్టీ ప‌గ్గాల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌కే ఇస్తార‌ని ఇందుకోసం తార‌క్ అభిమానులంతా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు.