Kodali Nani: రాజ‌కీయాల‌కు నాని గుడ్‌బై?

Kodali Nani to say good bye from politics

Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నాని రాజ‌కీయాల నుంచి శాశ్వతంగా త‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇక భ‌విష్య‌త్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌కూడ‌ద‌ని నాని నిర్ణ‌యించుకున్న‌ట్లు గుడివాడ స‌ర్కిల్‌లో భారీ టాక్ వినిపిస్తోంది. నాని నిర్ణ‌యం వెనుక రెండు కార‌ణాలు ఉన్నాయ‌ట‌. ఒక‌టి ఆయ‌నకు ఒక్కోసారి ఆరోగ్యం బాగుండ‌ద‌ని అందుకే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్నార‌ని కొంద‌రు అంటుంటే.. మొన్న ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి వైరాగ్యం పుట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి నాని ఇంట్లోని వారే పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.