Kodali Nani: “PK బుర్రలో గుజ్జు అయిపోయింది”
Kodali Nani: తెలుగు దేశం పార్టీ (TDP) నేతలను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత కిశోర్ (prashant kishore) కలవడంపై మండిపడుతున్నారు YSRCP నేతలు. కొడాలి నాని ప్రశాంత్‌పై కామెంట్స్ చేస్తూ 2019 ఎన్నికల సమయంలోనే ఆయన్ను బాగా వాడేసామని ఆయన బుర్రలో గుజ్జు అయిపోయిందని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలిసినా కలవకపోయినా తమకు జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు. జగన్ చేత వివేకానంద రెడ్డిని చంపించింది, కోడి కత్తి డ్రామా ఆడిచించింది ప్రశాంత్ కిశోరే అని TDP ఆరోపించిందని మరి అలాంటి వ్యక్తితో కలిసి ఎలాంటి రాజకీయ హత్యలకు ప్లాన్ చేస్తున్నారో వారే చెప్పాలని విమర్శించారు.
ఈ ఆ ఏమీ చేయలేరు : అంబటి రాంబాబు
ప్రశాంత్ కిశోర్ (pK) వచ్చినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చినా 2024లో ని గెలవకుండా ఆపలేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రశాంత్ కిశోర్ పోస్ట్‌మార్టం చేయగలుగుతారే కానీ బతికించి అధికారంలోకి మాత్రం తీసుకురాలేరని విమర్శలు గుప్పించారు.