Kodali Nani: సునీల్ ఒక పకోడీ.. చంద్రబాబు, పవన్ 420లు..
Vijayawada : గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని(kodali nani) మరోసారి ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న BJP ఏపీ ఇంచార్జి సునీల్ దియోధర్ కొడాలి నాని పై విమర్శలు చేయగా తాజాగా నాని కౌంటర్ ఇచ్చారు. సునీల్ తోపాటు చంద్రబాబు, పవన్ లపై ఫైర్ అయ్యారు. ముందుగా.. సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో సునీల్ దియోధర్ పాల్గొని మాట్లాడారు.. జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుంది. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారు. అని విమర్శలు చేసారు.
దీనిపై కొడాలి నాని స్పందించారు. సునీల్ పకోడీ అంటూ.. ఇలాంటి వాళ్ళ వల్ల బీజేపీ పరువుపోతుందన్నారు. మోడీ, అమితాషాలు ఇలాంటి వారిని నమ్ముకుంటే.. కర్ణాటకలో పట్టిన గతే పడుతుందన్నారు. అనంతరం ఇటీవల పవన్ కళ్యాణ్ జగన్ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో, చంద్రబాబును విలన్ గా, 420 బ్యాచ్ ఆయనకు అసిస్టెంట్లుగా నటించాలని కొడాలి నాని సూచించారు. అవసరమైతే దర్శకుడు రాంగోపాల్ వర్మతో తాను స్వయంగా మాట్లాడుతానని ఆయన అన్నారు.2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్, ప్రతిపక్షాల నేతలందరినీ నడిరోడ్డుపై నించో పెట్టక తప్పదని,ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని కొడాలి నాని స్పష్టం చేశారు.