Kodali Nani: గుడివాడలో అతను అస్సలు పోటీ చేయడు
AP: గుడివాడలో కొడాలి నానిని (kodali nani) ఎదుర్కొనేందుకు టీడీపీ నుంచి వంగవీటి రాధా బరిలో నిలుస్తారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ మధ్య ఎవరూ స్పందించలేదు. దీనిపై కొడాలి నాని స్పందిస్తూ.. వంగవీటి రంగా కుమారుడు రాధా.. తనకు సొంత సోదరుడితో సమానమని అన్నారు. అతను గుడివాడ నుంచి పోటీ చేయడని పేర్కొన్నారు. ఇక దీనిపై వంగవీటి రాధా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఏపీలో TDP అధినేత చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి మినీ మేనిఫెస్టోని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై YCP మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు.
ఇక చంద్రబాబు, లోకేష్ అంటే.. ఫైర్ అయ్యే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో మొత్తం పక్క రాష్ట్రాలు, ఏపీలోని నవరత్నాల పథకాల నుంచి కాపీ చేసుకుని తీసుకొచ్చిందని మండిపడ్డారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ఫొటో కూడా పెట్టకోవడం అవమానకరమన్నారు. ఈ సందర్బంగా ‘స్ర్కాప్ నా కొడుకులు అందరూ కలిసి మహానాడుపై సొల్లు కబుర్లు చెప్పారని’ నాని ఆరోపించారు. ఇక వ్యాఖ్యలను ఏపీలోని కాపులు అన్వయించుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం వైరల్ అయ్యింది.
దీంతో కొడాని నాని మరోసారి తన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని విమర్శించినట్లు వస్తున్న ప్రచారం వాస్తవం కాదని కొడాలి నాని అన్నారు. రాజకీయాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఎప్పుడూ తాను విమర్శించనని, రెండు దశాబ్దాలుగా తన గెలుపులో కాపు సోదరులు సగభాగం ఉందన్నారు. ఐటీడీపీ వారు తన వీడియోని కట్ చేసి.. తప్పుగా వక్రీకరించి పెట్టారని పేర్కొన్నారు. దీనికి జనసేన నాయకులు స్పందించారని అన్నారు. తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదని.. టిడిపి నీచుల మాయల జనసేన నాయకులు, కాపులు పడవద్దని కోరారు.