Kodali Nani: పవన్‌కి పార్టీ ఏమైపోయినా పర్వాలేదు
చంద్రబాబు నాయుడు (chandrababu naidu), పవన్ కళ్యాణ్‌పై (pawan kalyan) మరోసారి సంచలన కామెంట్స్ చేసారు YSRCP నేత కొడాలి నాని (kodali nani). పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి మైక్ పట్టుకోవాలని అనుకుంటున్నారని.. చంద్రబాబు సపోర్ట్ లేకపోతే కనీసం అసెంబ్లీ గేట్ కూడా పట్టుకోలేడని తెలిసే పొత్తు పెట్టుకున్నారని అన్నారు. పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం కోసం జనసేన పార్టీ ఏమైపోయినా పర్వాలేదు.. కార్యకర్తలు ఎన్ని తన్నులు తిన్నా పర్వాలదు అనుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి 18 సీట్లతో ప్రతిపక్ష హోదా కావాలంటే పవన్ సపోర్ట్ కావాలని అన్నారు.