Chiranjeevi వ్యాఖ్యలపై YSRCP కామెంట్స్

AP: చిరంజీవి (chiranjeevi) చేసిన వ్యాఖ్య‌ల‌పై YSRCP నేత‌లు స్పందించారు. పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రంలా సినిమా ఇండ‌స్ట్రీ మీద ప‌డ‌తారేంటి సర్ అని వైసీపీ ప్ర‌భుత్వానికి చుర‌క‌లు అంటించిన సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య సినిమా 200 రోజుల ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించిన సంద‌ర్భంగా చిరు వ‌చ్చారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ నటించిన బ్రో (bro) సినిమాలో ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబుపై (ambati rambabu) సెటైర్ వేసిన‌ట్లు క్యారెక్ట‌ర్ క్రియేట్ చేసార‌ని రాంబాబు ర‌చ్చ ర‌చ్చ చేసారు. బ్రో ఫండింగ్‌పై ప‌వ‌న్ (pawan kalyan) తీసుకున్న రెమ్యున‌రేష‌న్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన‌ట్లు కూడా తెలిపారు. దీని గురించి చిరంజీవి ప్ర‌స్తావించారు.

“” ప్ర‌త్యేక హోదా గురించి కానీ, రోడ్ల నిర్మాణం గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, పేద‌వారి క‌డుపు నిండే విష‌యం కానీ, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం గురించి కానీ, మీలాంటి వాళ్లు ఇలాంటి పెద్ద పెద్ద విష‌యాల గురించి క‌ల‌గ‌జేసుకుని, అవ‌న్నీ రాష్ట్రాల‌కు వ‌చ్చే చూస్తే ప్ర‌తి ఒక్క‌ళ్లు మీకు త‌ల‌వంచి న‌మస్క‌రిస్తారు. అవ‌న్నీ వ‌దిలేసి పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రంలా సినిమా ఇండ‌స్ట్రీ మీద ప‌డ‌తారేంటి స‌ర్? ఇదేదో పెద్ద స‌మ‌స్య అన్న‌ట్లు దేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌కండి “” అని చిరు అన్నారు. (chiranjeevi). దీనిపై YSRCP నేత‌లు ఏమ‌న్నారంటే..

కొడాలి నాని
ఎంపీ కొడాలి నాని (kodali nani) స్పందిస్తూ.. ప్ర‌భుత్వం అలా న‌డుచుకోవాలి ఇలా న‌డుచుకోవాలని చెప్పిన‌ప్పుడు సినిమా వాళ్ల‌కు కూడా ఆ నీతులు చెప్తే బాగుంటుంది క‌దా అని సెటైర్ వేసారు. “” సినిమా ఇండ‌స్ట్రీలో కొంద‌రు ప‌కోడీ గాళ్లు అలా న‌డుచుకో ఇలా న‌డుచుకో అని చెప్తున్నారు. చిరంజీవి వారికి కూడా ఇలా క్లాస్ పీకితే బాగుంట‌ది క‌దా? మ‌న‌కెందుకురా ఇవ‌న్నీ డ్యాన్సులు, ఫైట్లు చేసుకోక అని కొంద‌రు ప‌కోడీ గాళ్ల‌కు కూడా చెప్తే బాగుంట‌ది “” అని అన్నారు.

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (botsa satyanarayana) మాట్లాడుతూ.. పిచ్చుక‌పై బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించిన‌ట్లు ప్ర‌భుత్వం టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మై ప‌డిందేంటి అని చిరు చెప్పినప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ పిచ్చుక‌తో స‌మానం అని ఆయ‌న ఒప్పేసుకుంటున్న‌ట్లేనా అని రివర్స్ ప్ర‌శ్న వేసారు. “” ఆ ప‌థ‌కాలు అందించండి..ఈ మంచి చేయండి అని చెరు చెప్తున్నారు. ఏపీ ప్ర‌జ‌లకు అన్ని ప‌థ‌కాలు అందుతున్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు చిరంజీవి అలా ఎందుకు మాట్లాడారు? నేను ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా విన‌లేదు. మొత్తం వీడియో చూసాక అప్పుడు మాట్లాడ‌తా “” అన్నారు.

పేర్ని నాని
ఇక పేర్ని నాని (perni nani) కూడా చిరు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. చిరంజీవి అంటే త‌న‌కూ అభిమాన‌మేన‌ని.. కానీ ఎంత అభిమానం ఉన్నా గిల్లితే ఎలా ఊరుకుంటామ‌ని మండిప‌డ్డారు.