EXCLUSIVE: రేవంత్.. సీఎం అయ్యావ్.. ఎంజాయ్ చెయ్

EXCLUSIVE: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై (revanth reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు YSRCP ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani). సీఎం అయ్యాక ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) క‌నీసం ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్ప‌లేద‌ని రేవంత్ అలిగార‌ట‌. దాంతో కొడాలి నాని రేవంత్‌ను ఓ ప‌నిమీద అపాయింట్‌మెంట్ కోరితే కూడా నిరాక‌రించారు.

దీనిపై కొడాలి నాని స్పందిస్తూ.. తాము ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీతో ఒక్క ఫోన్ కాల్ చేయిస్తే రేవంత్ దిగొస్తాడ‌ని.. సీఎం అయ్యారు కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు ఎందుక‌ని మండిప‌డ్డారు. రేవంత్ సీఎం అయ్యార‌ని హ‌ర్షిస్తూ జ‌గ‌న్ ట్వీట్ చేసార‌ని.. చంద్ర‌బాబు నాయుడు లాగా ఎవ‌రు ఎప్పుడు సీఎం అవుతారా అని కాచుకుని కూర్చోలేం క‌దా అని విమ‌ర్శ‌లు గుప్పించారు.