Kodali Nani: చిరంజీవిని పకోడీ అనలేదు
తాను చిరంజీవిని (chiranjeevi) పకోడీ అని అనలేదని వివరణ ఇచ్చారు YSRCP నేత కొడాలి నాని (kodali nani). ఇటీవల ఏపీ ప్రభుత్వం బ్రో సినిమా (bro) గురించి దానికి వచ్చిన కలెక్షన్ల గురించి కామెంట్స్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి వారికి క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. ప్రజాసేవ చేయాల్సిందిపోయి పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అని మండిపడ్డారు. అప్పట్లో చిరు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ..సినిమాలోని పకోడీ గాళ్లకు కూడా చెప్పండి వాళ్ల పని వాళ్లు చూసుకోవాలని ఏపీ ప్రభుత్వం జోలికి రావద్దు అని అన్నారు.
ఈరోజు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు కొడాలి నాని. ఈ నేపథ్యంలో మీడియా వర్గాలు పకోడి అంటూ నాని చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించాయి. వాటిపై నాని స్పందిస్తూ.. “” అసలు నేనెప్పుడు చిరంజీవి గారికి పకోడీ అన్నాను? డ్యాన్సులు, సినిమాలు తీయడం రాని వాళ్లు వెదవలు అని అన్నాను. ఇవన్నీ చిరంజీవికి వచ్చు కదా? అలాంటప్పుడు చిరంజీవి పకోడీ ఎందుకు అవుతారు? నేను ఏం మాట్లాడానో చిరంజీవికి తెలుసు. ఆయన నా వీడియో చూసి ఉంటారు “” అని క్లారిఫై చేసారు నాని. (kodali nani)