kodali nani: భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబు(excm chandra babu naidu) గుడివాడ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రాని(idhem kharma mana rastraniki)కి కార్యక్రమంలో భాగంగా.. చంద్రబాబు మూడు రోజుల పాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం(machilipatnam), గుడివాడ(gudivada) తదితర నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రధానంగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(mla kodali nani).. చంద్రబాబు పేరు చెబితేనే మాటల తూటాలు పేలుస్తారు. అలాంటిది.. ఈ సారి చంద్రబాబు గుడివాడకు వచ్చి ఏం మాట్లాడతారు. ఎలాంటి విమర్శలు ఉంటాయి అన్నదానిపై ముందునుంచే చర్చ జరిగింది. ఇక గురువారం రాత్రి సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన ఊరిలో చంద్రబాబు ఓ రాత్రి గడిపి మరుసటి రోజు గుడివాడకు రోడ్‌షోగా వచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా కొడాలి నానిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా భిక్ష పెట్టింది టీడీపీ అని, గుడివాడలో పేదల భూములు దోచుకుంటున్నాడని, గంజాయి, క్యాసినోలు తీసుకొచ్చారని చంద్రబాబు.. నానిపై మండిపడ్డారు. దీనికి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాని.
గుడివాడ అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని నాని సవాల్ చేశారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం ఒక్క ఎకరమైనా కొన్నట్టు నిరూపించగలరా.. చంద్రబాబు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. హరికృష్ణ(hari krishna) ఎంపీగా ఉన్న సమయంలో నిమ్మకూరు(nimmakuru)ను అభివృద్ధి చేశారని నాని చెప్పారు. నిమ్మకూరుపై జూనియర్ ఎన్టీఆర్(jr ntr)కి, హరికృష్ణకి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పూలమాలలు వేసిన ఎన్టీఆర్(sr.ntr), బసవతారకం(basavatharakam) విగ్రహాలు కూడా ఆయన ఏర్పాటు చేసినవి కాదని, వాటిని తాను, జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేశామని నాని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన విగ్రహాలకు దండలు వేయడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు.