Kodali Nani: మ‌ళ్లీ జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టేసాడుగా..!

Kodali Nani: YSRCP నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మ‌ళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) ఇరుకున పెట్టాడు. అస‌లే టికెట్ క‌న్ఫామ్ కాలేద‌న్న గుబులో లేదా ఇంకేద‌న్నా టెన్ష‌న్ ప‌డుతున్నారో తెలీదు కానీ నాని మ‌ళ్లీ టంగ్ స్లిప్ అయ్యారు. గ‌తంలోనూ ఇలా టంగ్ స్లిప్ అయ్యే.. ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్‌లు మిగిల్చాడు.

ఏం జ‌రిగింది?

కొడాలి నాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆయ‌న పేరు తెలీని వారు ఉండ‌రు. అది కూడా YSRCP అధికారంలోకి వచ్చాక పొటిటిక‌ల్ బూతు భాషాశాస్త్రంలో పండితుడిగా పేరు మోసారు కొడాలి నాని. ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి నోరు విప్పారంటే ఇళ్ల‌ల్లో టీవీలు క‌ట్ చేస్తుంటారు. బూతు లేకుండా త‌న నోటి వెంట మాటే రాదు అన్న‌ట్లుగా అధ‌మ స్థాయి భాష మాట్లాడ‌టంలో మెగా ప్రావీణ్యం ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని అప్పుడ‌ప్పుడు గుట్కా న‌మిలి ఊసినంత ఈజీగా క‌ఠోర నిజాలు పుసుక్కున క‌క్కేస్తుంటారు. అది చూసాక కొడాలి కొంప ముంచాడు అంటూ వైసీపీ వ‌ర్గాలే త‌ల‌లు ప‌ట్టుకుంటూ ఉంటాయి. అదే విధంగా తాజాగా.. కొడాలి నోటి వెంట ఓ నిప్పు లాంటి నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. (Kodali Nani)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యాన్ని సైతం అప్పు కోసం బ్యాంకులో తాక‌ట్టు పెట్టి ఘ‌న‌త వ‌హించారంటూ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల సంచ‌ల‌న క‌థ‌నాలు వ‌చ్చాయి. తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా నోట మాట ప‌డిపోయింది. ఇలాంటి ఏ ఆరోప‌ణ వ‌చ్చినా ఆగమేఘాల‌పై ప్రెస్ మీట్ల‌కు ప‌రిగెత్తే లీడ‌ర్ల‌కు వైసీపీలో కొద‌వ లేదు. కానీ ఎందుకో ఒక్క‌రూ ఈ విష‌యాన్ని ఖండించ‌లేదు. జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌ల్లో సైతం 24 గంట‌లు గ‌డిచినా ఎలాంటి ఖండ‌న లేదు. స్పంద‌నా లేదు. ఆ త‌ర్వాత సంబంధిత ప్ర‌భుత్వ అధికారులు ఖండ‌న లేఖ ఇచ్చార‌న్న‌ట్లు ఏదో మేనేజ్ చేసారు. అయితే.. ఈలోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం కొడాలి నాని నోటి దుర‌ద దూరంలో జ‌రిగిపోయింద‌నే చెప్పాలి.

ALSO READ: Posani Krishna Murali: కాపుల‌ను సీఎం చేయ‌రా?

స‌చివాల‌యం ఏమ‌న్నా మీ అబ్బ సొత్తా.. తాక‌ట్టే క‌దా పెట్టాం. దానికే భూమి బ‌ద్ధ‌లైన‌ట్లు గింజుకుంటారేంటి? సచివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టుకునే హ‌క్కు కూడా సీఎంకు లేదా? అస‌లు స‌చివాల‌యం అంటే ఏంటి? ప‌ది ఎక‌రాల స్థ‌లం. అటు ఖ‌జానాలో డ‌బ్బు లేక ఇటు అప్పులు పుట్ట‌క బ‌ట‌న్లు ఎలా నొక్కాలి? ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. బ‌ట‌న్లు నొక్క‌డం ఆపేస్తే ఓట్లు ఎవ‌రు వేస్తారు? ఇదంతా కామ‌న్. ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌జ‌ల ఆస్తులు తాక‌ట్టుపెట్ట‌డం.. అప్పుకులు తెచ్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం ఇవే మాట‌లు అన‌క‌పోయినా ఇదే అర్థం వ‌చ్చేలా కొడాలి నాని వ్యాఖ్యానించారు. దాంతో ఈ వ్యాఖ్య‌ల‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు నాని నానా క‌ష్టాలు ప‌డ్డార‌ట‌.

నిజానికి స‌చివాల‌యం తాక‌ట్టు విష‌యంలో వైసీపీ అధిష్ఠానం కాస్త లేట్‌గా రియాక్ట్ అయ్యింది. నిజం ఒప్పుకుంటూనే స‌మ‌ర్ధించుకోవాలో.. లేక పూర్తిగా ఎదురుదాడికి దిగాలో ఆలోచించుకునేందుకు కొంచెం స‌మ‌యం తీసుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత ఎదురుదాడికే ఫిక్స్ అయ్యారు. ప‌చ్చ మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు అంటూ య‌థాత‌థంగా ఎదురుదాడికి దిగింది. అయితే అధిష్ఠానం ఏ స్టెప్ తీసుకుంటుందో ప‌సిగ‌ట్ట‌లేక నాని నోరు జారారు. దాంతో ప్ర‌భుత్వం రాష్ట్ర స‌చివాల‌యాన్ని తాక‌ట్టుపెట్టిన‌ట్లు నిస్సిగ్గుగా అంగీక‌రించిన‌ట్లు అయ్యింది.