Kishan Reddy: తెలంగాణ BJP అధ్య‌క్షుడిగా కిష‌న్‌?

Hyderabad: తెలంగాణ BJP అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డిని (kishan reddy) ఎంపిక చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ పోస్ట్‌లో క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) ఉన్నారు. కానీ కొంత‌కాలంగా సంజ‌య్‌కి.. తెలంగాణ BJP నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దాంతో చాలా మంది సంజ‌య్ ఆ ప‌ద‌వికి అర్హుడు కాదంటూ హైక‌మాండ్‌కు కంప్లైంట్ చేసారు. దాంతో చాలా మంది ఆ ప‌ద‌వి ఈటెల రాజేంద‌ర్‌కు (etela rajender) వెళ్తుంద‌ని అనుకున్నారు కానీ కిష‌న్ రెడ్డికి ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు (telangana elections) అయ్యేవ‌ర‌కు ఎలాంటి మార్పులు చేయ‌డంలేద‌ని BJP అంటోంది.