Kishan Reddy: ఒకటి గెలవగానే రాహుల్‌కి రెక్కలొచ్చినట్లున్నాయ్!
Hyderabad: BJP ఎంపీ కిషన్ రెడ్డి (kishan reddy) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (rahul gandhi) మండిపడ్డారు. నిన్న ఖమ్మంలో నిర్వహించిన సభలో మాట్లాడిన రాహుల్.. BRS.. BJPకి B టీమ్ అంటూ కామెంట్స్ చేసారు. BJP, BRS పార్టీలు ఒక్కటే అని బయటికి మాత్రం శత్రువులుగా నటిస్తున్నారని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసే BRS పార్టీతో పొత్తు మాత్రం అస్సలు పెట్టుకోం అని తెలిపారు. దీనిపై కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవగానే రాహుల్‌కి రెక్కలు వచ్చినట్లున్నాయని అన్నారు. ఇంకోసారి BRS BJPకి B టీమ్ అంటే ఊరుకునేది లేదని మందలించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తయారుచేసిన స్క్రిప్ట్ చదివి రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని BRS నేత దాసోజు శ్రవణ్ (dasoju sravan) అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ (congress).. రానున్న తెలంగాణ ఎన్నికల్లోనూ అదే మంత్రంతో తెలంగాణను పవర్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది.