Kishan Reddy: రవిందర్ మరణానికి కారణం BRS
హోంగార్డు రవిందర్ (ravinder) మరణానికి కారణం BRS ప్రభుత్వమేనని మండిపడ్డారు BJP నేత కిషన్ రెడ్డి (kishan reddy). హైదరాబాద్లోని గోషామహన్ వద్ద ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్ కొన్ని రోజుల క్రితం నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రవీందర్ ఈరోజు మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రవీందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు కిషన్ రెడ్డి. బుధవారం నాడు రవీందర్ డ్యూటీకి వెళ్లాక.. అతని భార్యకు ఫోన్ చేసాడు. ఆ సమయంలో ఇద్దరు పై అధికారులు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని చెప్పి బాధపడ్డాడట. జీతం వేయడంలో ఆలస్యం అవుతోందన్న కారణం కూడా అతని ఆత్మహత్యకు కారణం అయివుండచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. రవీందర్ మృతి పట్ల తెలంగాణ సీఎం KCR సంతాపం తెలిపారు.