Kiran Kumar Reddy: చిన్న వ‌య‌సులో CM అయ్యావ్.. ఇదేం పాల‌న‌?

AP: చిన్న వ‌య‌సులో సీఎం అయ్యావ్.. ఇలాగేనా పాలించేది అంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (ap cm jagan) మండిప‌డ్డారు మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి (kiran kumar reddy). వైజాగ్‌లో ప్ర‌భుత్వ పాల‌న ఎలా ఉందో ఆ జిల్లా సిట్టింగ్ ఎంపీనే స్వ‌యంగా వెల్ల‌డించాడ‌ని అన్నారు. ఆయ‌న వైజాగ్‌లో వ్యాపారం చేసుకోలేన‌ని, హైద‌రాబాద్ వెళ్లిపోతాన‌ని చెప్పాడని తెలిపారు. ఆ పార్టీ ఎంపీనే కిడ్నాప్ చేసి మ‌రీ కొట్టించిన ప్ర‌భుత్వం YCPది అంటూ మండిప‌డ్డారు. అరాచ‌కానికి కూడా ఒక హ‌ద్దు ఉంటుంద‌ని, ప‌రిపాల‌న అంటే ప్ర‌తి గ్రామానికి చెందిన పేద‌ల‌ను ఆదుకోవడ‌మ‌ని అన్నారు. గ‌తంలో TDP ఇలాంటి అరాచ‌క పాల‌న‌కు పాల్ప‌డేద‌ని, ఇప్పుడు TDPని చూసి YCP నేర్చుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఒక‌ప్పుడు TDP జ‌న్మ‌భూమి క‌మిటీ పెట్టి బియ్యం లూటీ చేసేద‌ని, ఇప్పుడున్న YCP ఏకంగా రాష్ట్రాన్నే లూటీ చేస్తోంద‌ని ఆరోపించారు.