Kiraak RP: కూట‌మితో నాలుగో వ్య‌క్తి కూడా పొత్తు పెట్టుకున్నారు

kiraak rp says tirumala balaji is also part of alliance in ap

Kiraak RP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం, భార‌తీయ జన‌తా పార్టీ, జ‌న‌సేన పార్టీల‌తో పాటు నాలుగో వ్య‌క్తి కూడా పొత్తు పెట్టుకున్నార‌ని అన్నారు తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తుదారుడు కిరాక్ ఆర్పీ. ఆ నాలుగో వ్య‌క్తి ఎవ‌రో కాద‌ని.. సాక్షాత్తు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామే పొత్తు పెట్టుకుని మ‌రీ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దించి ప్ర‌జ‌ల‌కు మేలు చేసార‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో శ్రీవారి స‌న్నిధి త‌ప్ప మిగ‌తాదంతా దందానే చేసార‌ని.. గాజు సీసాలో నీళ్లు 20 రూపాయ‌లు ఉండాల్సింది 70 రూపాయ‌ల‌కు అమ్ముతున్నార‌ని.. బాటిల్ తిరిగిచ్చేస్తే మిగ‌తా డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్తున్నార‌ని.. అలా ఎవ్వ‌రూ తిరిగి ఇవ్వ‌లేర‌ని తెలిసే ఈ రూల్ పెట్టి ఆ డ‌బ్బుల‌ను దోచుకున్నార‌ని ఆర్పీ ఆరోప‌ణ‌లు చేసారు.