Kim Jong Un: లైంగిక కోరికల కోసం ఏటా 25 యువతుల్ని ఎంపిక చేస్తున్న కిమ్
Kim Jong Un: ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఓ షాకింగ్ అంశం బయటపడింది. ఆయనకు సంబంధించిన అన్ని అంశాలు ఇతర దేశాలకు షాకింగ్‌గానే ఉంటాయి. కానీ ఈ విషయం మాత్రం ఇంకాస్త షాక్‌కు గురిచేస్తుంది. తనతో పాటు తన వద్ద ఆఫీసర్లుగా పనిచేసేవారి లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు కిమ్ ఏటా 25 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తుంటాడట.
ఉత్తర కొరియా నుంచి పారిపోయి వేరే దేశానికి వెళ్లిపోయిన యెమోని పార్క్ అనే యువతి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. కిమ్ ఏటా ప్లెజర్ స్వ్కాడ్ పేరిట 25 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తాడు. వారంతా కచ్చితంగా అందంగా ఉండాలి. రాజకీయ పరంగా నిజాయతీగా వ్యవహరించాలి. పైగా అందరూ కన్యత్వంతోనే ఉండాలి. వారిని ఎంపిక చేసే సమయంలో కన్యత్వం ఉందో లేదో పరీక్షలు చేయిస్తారు. యోని భాగంలో ఏదైనా తేడాగా అనిపిస్తే వారిని రిజెక్ట్ చేస్తారు. అయితే ఆ 25 అమ్మాయిలకు చెందిన బంధువులు ఉత్తర కొరియా నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్నట్లైతే వారిని రిజెక్ట్ చేస్తాడు.
ఈ 25 మంది అమ్మాయిల్ని మూడు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక గ్రూప్‌లోని అమ్మాయిల చేత మసాజ్‌లు రెండో గ్రూప్‌లోని అమ్మాయిల చేత డ్యాన్సులు, ఇక మూడో గ్రూప్‌లోని అమ్మాయిల చేత లైంగిక వాంఛలు తీర్చుకుంటారు. ఇలా 25 మంది ఏడాది పాటు కిమ్ కోసం పని చేస్తారు. ఇందుకోసం వీరికి భారీగా డబ్బు కూడా ఇస్తారు. ఏడాది అయిపోయాక మళ్లీ కొత్త బ్యాచ్‌ను ఎంపిక చేస్తారు.
ఆ అమ్మాయిల డ్యూటీ అయిపోయాక వారిని తన వద్ద ఉండే బాడీగార్డులకు ఇచ్చి పెళ్లిళ్లు చేయించేది కూడా కిమ్మే. ఈ దిక్కుమాలిన ఐడియా కిమ్‌కి తన తండ్రి కిమ్ జాంగ్ 2 నుంచి వచ్చింది. కిమ్ తండ్రి కూడా ఇలాగే అమ్మాయిలను ఎంపిక చేసి తన లైంగిక వాంఛలను తీర్చుకునేవాడు. ఇలా చేస్తే తనకు మరణం అనేదే ఉండదు అని నమ్మేవాడు. ఇప్పుడు అతని కుమారుడైన కిమ్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు.