Women’s Reservation Bill: అలాంటి వారికేగా మీరు సీట్లు ఇచ్చేది
కొత్త పార్లమెంట్ భవనంలో ఈరోజు జరిగిన సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు (women’s reservation bill) గురించి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (mallikarjun kharge).. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపామని BJP సంబరపడిపోతోంది కానీ.. ఆ పార్టీ వారు చదువురాని ఆడవారికే సీట్లు ఇస్తారని ఖర్గే వ్యాఖ్యానించారు. వారికి సీట్లు కేటాయిస్తే పార్లమెంట్‌లో ఏ విషయంపైనా నోరు మెదపాల్సిన అవసరం ఉండదని అన్నారు. దాంతో నిర్మలమ్మకు పీకలదాకా కోపం వచ్చింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే గారు కాస్త వెనకా ముందు ఆలోచించి మాట్లాడాలని మండిపడ్డారు. BJPలో ఉన్న మహిళా నేతలంతా చదువుకున్నవారేనని అన్నారు.
ఇరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఇలా..!
ఖర్గే: చదువులేని ఎస్సీ మహిళలను తెచ్చి పార్లమెంట్ సభ్యులుగా కూర్చోపెడతారు. నాకు తెలీదా ఏంటి వీరి సంగతి
నిర్మల: మీరు అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. BJP ఎప్పుడూ అలా చేయదు. మా పార్టీలో ఉన్న మహిళా నేతలంతా చదువుకున్నవారే. మన రాష్ట్రపతి ఎవరు?
ఖర్గే: రాష్ట్రపతి ముర్ముకి ఉన్న సౌకర్యం ఇతర ఎస్సీ మహిళలకు ఉండదు కదా..?
నిర్మల: అలా ఎలా మీరు ఆడవారిని విభజించి మాట్లాడతారు?
అలా ఇద్దరూ వాగ్వాదానికి దిగడంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ రాతపూర్వకంగా లేఖలు సమర్పిచాలని ఇలా పార్లమెంట్‌లో గౌరవనీయ స్థానాల్లో ఉన్న నేతలు తిట్టుకోవడం సరికాదని మందలించారు. (women’s reservation bill)