UK లో భారత అధికారికి చేదు అనుభవం
యూకేలో (uk) భారత అధికారికి చేదు అనుభవం ఎదురైంది. యూకేకి ఇండియన్ హై కమిషనర్ అయిన విక్రమ్ దొరైస్వామి.. (vikram doraiswamy) స్కాట్‌ల్యాండ్‌లో ఉన్న ఓ గురుద్వారాకు వెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖలిస్తానీ సానుభూతిపరులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (hardeep singh nijjar) హత్య కేసులో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) ఆరోపణలు చేసిన నేపథ్యంలో విక్రమ్ దొరైస్వామికి ఈ అనుభవం ఎదురైంది. దీనిపై భారతీయ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.