బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఖలీదా జియా కొడుకు.. ఎంతకు తెగించార్రా..!
Khaleda Zia: బంగ్లాదేశ్‌లో అల్లర్లు చోటుచేసుకోవడం.. దాని వల్ల దాదాపు 300 మంది పౌరులు చనిపోవడం వెనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. జియా కుమారుడు తారీఖ్ రెహ్మాన్ లండన్.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ సాయం తీసుకుని బంగ్లాదేశ్‌లో ఈ అల్లర్లు సృష్టించాడట. ఇలా చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోయి తన పార్టీ అధికారంలోకి వస్తుందని పన్నాగం పన్నినట్లు ఇంటెల్ రిపోర్ట్ చెప్తోంది.
ఈ అల్లర్లకు సంబంధించిన బ్లూప్రింట్ లండన్‌లోనే ప్రిపేర్ అయ్యిందట. తారీఖ్ రెహ్మాన్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఉంటున్న ఐఎస్ఐ అధికారులను కలిసి ప్లాన్ వేసాడు. ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో పాకిస్థాన్ నుంచి యాంటీ బాంగ్లాదేశ్ పోస్ట్‌లు పెట్టించి ఆ దేశ యువతను రెచ్చగొట్టేలా చేసారు. హసీనా ప్రభుత్వంపై మొత్తం 500 ట్వీట్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాకిస్థాన్‌కు ముందు నుంచీ మద్దతుగా నిలుస్తోంది. దాంతో ఖలీదా జియాకు ఆమె కుమారుడికి ఏం కావాలన్నా పాకిస్థాన్ చేసిపెడుతుంది. ఈ అల్లర్లలో చైనా కూడా ఐఎస్ఐ సాయంతో కీలక పాత్ర పోషించింది.
విద్యార్థుల ద్వారా దాడులు చేయించి..
జమాత్ ఎ ఇస్లామీ బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్ధుల సంఘం ICS (ఇస్లామీ ఛాత్రా షిబిర్) ఈ అల్లర్లను సాకుగా పెట్టుకుని హసీనా ప్రవేశపెట్టిన కోటా బిల్లుపై ఆందోళన కాస్తా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మార్చింది. ICSకు పాకిస్థాన్ నుంచి చైనాకు చెందిన కొన్ని సంస్థలు ఫండ్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ అల్లర్ల నేపథ్యంలో చోటుచేసుకున్న మరో ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ సహబుద్దిన్ హసీనా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ఓ కేసులో అరెస్ట్ అయిన ఖలీదా జియాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసారు.