Telangana Elections: గెలుపెవ‌రిదైనా.. ఈ స‌మ‌స్య త‌ప్ప‌దా?

Telangana Assembly Elections: న‌వంబ‌ర్ 30న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు (telangana elections) జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (BRS), ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ (congress) త‌మ అభ్య‌ర్ధుల‌ను, మేనిఫెస్టోల‌ను రిలీజ్ చేసేసింది. కానీ భారతీయ‌ జ‌న‌తా పార్టీ (BJP) మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అభ్య‌ర్ధుల లిస్ట్‌ని కానీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తామ‌నేది కానీ ప్ర‌క‌టించింది లేదు. ఇప్ప‌టికే ఏ పార్టీ వారు ఆ పార్టీ గెలిచేస్తుందని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

గెలుపు ఎవ‌రిదైనా కావ‌చ్చు.. చివ‌రికి రాష్ట్రానికి, మ‌న‌కు మంచి జ‌ర‌గాలి అనేదే ఎజెండా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలిచినా ఒక స‌మ‌స్య మాత్రం అలాగే ఉండిపోతుంది అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. ఏంటా స‌మ‌స్య అంటే.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఆల్మోస్ట్ ప‌డిపోయింద‌నే అంటున్నారు. దానికి తోడు.. ఇప్పుడు మేనిఫెస్టోల్లో ప్ర‌క‌టించినవ‌న్నీ త‌ప్ప‌క నెర‌వేర్చి తీరాల్సిందే. అలా చేయ‌క‌పోతే ప్ర‌జ‌ల నుంచి ప్రతిప‌క్ష పార్టీల నుంచి నిర‌స‌న త‌ప్ప‌దు.

అప్ప‌టికీ తెలంగాణ ప్ర‌స్తుత సీఎం KCR.. భార‌త రాష్ట్ర స‌మితి మేనిఫెస్టోను ప్ర‌క‌టిస్తూ.. వాయిదాల వారీగా వృద్ధాప్య‌ పెన్ష‌న్, విక‌లాంగుల పెన్ష‌న్ పెంచుతామ‌ని దీని వ‌ల్ల ఒకేసారి రాష్ట్రంపై కూడా ఆర్థిక భారం ప‌డ‌ద‌ని అన్నారు. ప్ర‌భుత్వాల వ‌ల్ల నిరుపేద‌లు, పేద‌లు లాభ‌పడుతున్న‌ప్ప‌టికీ.. మ‌ధ్య‌లో న‌లిగిపోయేది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలే. ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్నా ప‌న్ను భారం ప‌డేది కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌పైనే. అంటే సంప‌న్నులపై ప‌డ‌దు అని కాదు. వారికి ఈ ప‌న్నులు పెద్ద లెక్క కాదు క‌దా..! కాబ‌ట్టి ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా ముందు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చాల‌నే చూస్తాయి. ఈ హామీల విష‌యంలో ప‌డి రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాలికి వ‌దిలేస్తే మాత్రం అప్పులు అంత‌కు అంత పెరుగుతూనేపోతాయి. ఈ విష‌యంలో అధికారంలోకి వ‌చ్చే ఏ ప్రభుత్వమైనా కాస్త చర్చించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.  (telangana elections)