Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం
Skill Development Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌తో పాటు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వారికి బెయిల్ మంజూరు చేయడం సమంజసమే అని స్కాం జరిగిందన్న ఆధారాలు కూడా చూపించకుండా బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ ఎలా పిటిషన్ వేస్తారని న్యాయమూర్తి ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసారు.