Kethireddy Venkatarami Reddy: రాజకీయ నాయకులు ప్రజలకు దూరంగా ఉండాలి
“” పథకాలు అమలు చేసేందుకు భయమేస్తున్నా అమలు చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఆ పథకాలు చెప్పుకునే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలు అయ్యింది కాబట్టి అప్పుడే ఏదో అద్భుతాలు చేసేస్తారు అనుకోవడం పొరపాటు. అందులోనూ చంద్రబాబు నాయుడు చేస్తారనుకోవడం మరీ తప్పు. వారికి ఏడాది పాటు సమయం ఇచ్చి చూద్దాం. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఉచిత పథకాలు ఇవ్వలేదు. ఒక్క అమ్మవడి తప్ప. ఎందుకంటే అమ్మవడి అనేది పిల్లల చదువు కోసం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఉచితంగా ఇవ్వాలనుకున్నారు.
నాకు ఈ రాజకీయాల్లో ఒక్కటే అర్థమైంది. ఉదయాన్నే లేచి ప్రజల మధ్యకు వెళ్తే ప్రజలకు నచ్చదు. ప్రజలకు అధికారంలోకి వచ్చాక కనిపించని రాజకీయ నాయకులు.. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులనే కోరుకుంటారని అర్థమైంది. నేను గుడ్‌మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేపడితే నాకు మంచి పేరు వస్తుందని అనుకున్నాను కానీ నాకు నిందలు, అవమానాలు తప్ప ఏమీ మిగల్లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం “” అని తెలిపారు.