Kethireddy: నేను లెక్కల్లో ఫస్ట్.. అందరి లెక్కలు తేలుస్తా
Kethireddy: ధర్మవరం చాలా సెన్సిటివ్ ప్రాంతమని.. ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం తగ్గించేందుకు తనకు 15 సంవత్సరాలు పట్టిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈరోజు ఆయన వాహనంపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తన కార్యకర్తలను జైల్లో పెట్టారని తెలిసి వారిని పరామర్శించేందుకు కేతిరెడ్డి తన కారులో బయలుదేరారు. తన కారు డ్రైవర్ హార్న్ కొట్టినందుకు తన వాహనంపై ఎటాక్ చేసారని.. తన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యానని అన్నారు. కొన్ని ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం అని వేచి ఉన్నానని.. కానీ వారు అప్పటివరకు ఆగేలా లేరని అన్నారు.
తాను చిన్నప్పటి నుంచి లెక్కల్లో ఫస్ట్ అని అందరి లెక్కలు తప్పకుండా తేలుస్తానని హెచ్చరించారు. తాను ఫ్యాక్షనిజం వల్ల చాలా కోల్పోయాను కాబట్టే దానికి దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రజా సేవ కోసం వచ్చానని.. కూటమి సర్కార్‌కు ఓటు వేయొద్దు అని ధర్మవరం ప్రజలను ఎంత మొత్తుకున్నా వారు వినకుండా ఓటేసి ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాటించాల్సిన అవసరం ఏంతో ఉందని.. తనపై ఎందుకు అంత కోపమో తనకు ఇంకా అర్థం కావడంలేదని తెలిపారు.