Kethireddy: షర్మిళ బాలయ్య సినిమాలో విలన్‌లా ఉంది
Kethireddy: నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాలోని విలన్‌తో వైఎస్ షర్మిళను పోలుస్తూ కామెంట్స్ చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. సొంత అన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించేలా షర్మిళ, విజయమ్మలు ప్లాన్ వేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ఏమో పెదరాయుడు సినిమాలో ఆస్తులు పంచినట్లు చెల్లెలికి పంచితే.. షర్మిళ వీరసింహారెడ్డి సినిమాలో చెల్లెలు అన్నను పొడిచినట్లుగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ క్యాన్సిల్ అయితే.. అది కుటుంబానికే నష్టం అని కేతిరెడ్డి అన్నారు.
“” షర్మిళ గారూ.. సునీతారెడ్డి తన తండ్రి వివేకానంద రెడ్డిని ఎన్ని మాటలతో ధూషించేదో మనం అందరం చూసినవాళ్లమే. ఇతన్ని పోషించడమే ఎక్కువ అని ఎన్నో మాటలు అనేవారు. అలాంటి సునీతతో కలిసి జగన్, అవినాష్ రెడ్డిలే వివేకాను చంపించారు అని మీరు ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్? మీరు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కమెడియన్‌గా మారిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఇక్కడ విలన్‌గా మారారు. ఇప్పుడు కుటుంబాన్ని రోడ్డుకి లాగి హీరో అయిపోవాలని అనుకుంటున్నారు. మీరు కుటుంబాన్ని రచ్చకీడ్చి హీరో అవ్వాలనుకోవడం పొరపాటు “” అన్నారు.