Kesineni Chinni: జగన్.. ప్రతిపక్షం పోయింది.. ప్రజల్లో కూడా లేకుండాపోతావ్
Kesineni Chinni: మాటిమాటికీ తెలుగు దేశం పార్టీ ఈవీఎం హ్యాక్ చేసి ఎన్నికల్లో గెలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేత కేశినేని చిన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి 80 శాతం మంది ఓటర్లు ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసారని.. ఒకవేళ ఫ్యాన్ గుర్తుకు వేసినా సైకిల్కి పడినట్లు తెలిస్తే వారు రచ్చ చేసేవారని కానీ అలా జరగలేదంటే ప్రజలు తనను నమ్మి ఓట్లేసి గెలిపించినట్లే కదా అని జగన్ అన్నారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో దానిని జీర్ణించుకోలేక ఈవీఎంలు హ్యాక్ చేసారని ఆరోపిస్తున్నారని 2019లో ఎలాంటి మోసం చేయకుండా జగన్ ఎలా గెలిచారో తాము కూడా ఈ 2024 ఎన్నికల్లో అలాగే గెలిచామని చిన్ని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే లేకుండాపోయిందని.. ఇంకా ఈవీఎంల భ్రమలో ఉంటే ప్రజల మధ్య కూడా జగన్ లేకుండాపోతాడని చిన్ని మండిపడ్డాడు. ప్రజల సొమ్ముతో రుషికొండను తవ్వేసి భవనాలు నిర్మించారని.. ఆ సొమ్మంతా కక్కించి ప్రజలకు చేరుస్తామని తెలిపారు.