Congress: ఇజ్రాయెల్ ప్రధానిని చంపేయాలి.. కాంగ్రెస్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
Congress: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుని (benjamin netanyahu) తుపాకీలతో కాల్చి చంపాలని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు కేరళ కాంగ్రెస్ ఎంపీ రాజమోహన్ ఉన్నిథాన్ (rajmohan unnithan). కేరళలోని కాసర్‌గోడ్‌లో పాలెస్తీనా వాసులకు మద్దతుగా ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజమోహన్ పాల్గొన్నారు. నేతన్యాహు ఒక క్రిమినల్ అని అతన్ని చంపినా పాపం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాన్ని ప్రేరేపించే క్రిమినల్స్‌ని చంపేందుకు న్యూరెంబర్గ్ ట్రైయల్స్ వేసేవారని ఇప్పుడు అదే ట్రయల్ బెంజమిన్ నేతన్యాహుపై కూడా వేయాలని రాజమోహన్ అన్నారు. జెనీవా కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించేవారు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బతికే అర్హత లేదని అన్నారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం మొదలై నేటికి 43 రోజులు అవుతోంది.