Kejriwal: బీజేపీ ఎవరినైనా జైల్లో పెడుతుంది
Delhi: ఢిల్లీ లిక్కర్(delhi liquor policy scam )కేసులో ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్(aravind kejriwal) సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే.. సీబీఐ నోటీసులు అందించినప్పటి నుంచి.. అరెస్టు చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక సీబీఐ విచారణకు తొలిసారిగా కేజ్రీవాల్ హాజరవుతున్నారు. ఈడీ(ed), సీబీఐ(Cbi) వంటి దర్యాప్తు సంస్థలు ఒక్కసారి విచారణకు పిలిచి అరెస్టు చేయడం అనేది ఎప్పూడు చేయలేదు. రెండు, మూడు దఫాలుగా విచారణకు పిలిచి.. సాక్ష్యాధారాలను బట్టి ఎవరినైనా అరెస్టు చేస్తుంది. ఈ విషయం ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా(sisodia) విషయంలో కూడా అంతే జరిగింది. ఇప్పటికిప్పుడే కేజ్రీవాల్‌ని అరెస్టు చేసే అవకాశం లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది చూడాల్సి ఉంది.
ఇక సీబీఐ విచారణకు వెళ్తున్న సమయంలో కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(bjp)ని ఉద్దేశిస్తూ.. ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతలు ఎవరినైనా జైలుకు పంపగలరని ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని బీజేపీ బలంగా కోరుకుంటోందన్నారు. బహుశా సీబీఐ (cbi)ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు, నాయకులు, పార్టీ నేతలను అయినా.. ఈ విధంగా సీబీఐ, ఈడీ సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. కానీ తాను ఏ తప్పూ చేయలేదని.. నా నిజాయతీని నిరూపించుకుంటానని కేజ్రీవాల్ చెప్పి.. సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.