Telangana: సోషల్ మీడియాలో గెలిచిన‌ట్లేనా?

Telangana: మొత్తానికి రెండుసార్లు BRSకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు హ‌స్తానికే ఓటేసారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేసారు. కాంగ్రెస్ గెలిచింద‌ని తెలీగానే సోష‌ల్ మీడియాలో అరెరె BRS పార్టీ గెలుస్తుంది అనుకున్నామే అని చాలా మంది నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా KTR హైద‌రాబాద్‌ని డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు ఏ మంత్రి చేయ‌గ‌ల‌రు అనే చ‌ర్చ మొద‌లుపెట్టారు. కాంగ్రెస్ వ‌చ్చేసింది ఇక క‌రెంట్ క‌ష్టాలు మొద‌లైపోతాయి అనుకుంటూ తెగ కామెంట్ప్ పెట్టేస్తున్నారు. మ‌రోప‌క్క కాంగ్రెస్ స‌పోర్ట‌ర్లు BRS స‌పోర్ట‌ర్ల‌తో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఇంకొంత మందైతే ఇక తెలంగాణ ప‌రిస్థితి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లాగే అవ్వ‌బోతోంద‌ని.. అక్క‌డ గుడివాడ అమ‌ర్నాథ్ ఐటీ మంత్రిగా ఉండి ఏమీ చేయ‌లేక‌పోయిన‌ట్లు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక‌రిని ఐటీ మంత్రిని చేస్తార‌ని దాంతో ఇక తెలంగాణ ప‌రిస్థితి కూడా ఇలాగే అవ్వ‌బోతోంద‌ని అంటున్నారు. అందుకే ఇటీవ‌ల నేత క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు కూడా దీనిపై స్పందించారు.

ఓట్లు వేసే స‌మ‌యంలో కులం మ‌తం గురించి ఆలోచించి వేరే పార్టీని గెలిపించి ఇప్పుడు ఐటీ మంత్రిగా ఎవ‌రు వ‌స్తారో అని ఏడిస్తే ఏం లాభం అని వెట‌కారంగా ట్వీట్ చేసారు. దీనిని బ‌ట్టి చూస్తే BRS పార్టీ కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే గెలిచి బ‌య‌ట మాత్రం ఓడిపోయింద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అంటే చ‌దువుకున్న‌వారంతా BRS పార్టీ పేద‌వారంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించార‌న్న మాట‌..!