KCR: రేపే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR.. గజ్వేల్ ఎమ్మెల్యేగా రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొంత కాలం క్రితం ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోవడంతో తుంటి ఎముకకు సర్జరీ జరిగింది. దాంతో ఆయన ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకొని 12:45 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.