BRS: క‌ర్ణాట‌క కాదు.. మ‌హారాష్ట్ర‌పై కేసీఆర్ క‌న్ను..!

Hyderabad: భార‌త రాష్ట్ర స‌మితిగా(brs) పేరు మార్చి తెలంగాణ రాష్ట్ర స‌మితి(trs) పార్టీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్(kcr). క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) బీఆర్ ఎస్ కూడా పోటీ చేస్తుంద‌ని అప్ప‌ట్లో పుకార్లు వినిపించాయి. కానీ కేసీఆర్ మాత్రం క‌ర్ణాట‌క వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఇందుకు కార‌ణం.. ఆయ‌న ఫోక‌స్ మ‌హారాష్ట్ర‌పై ఉండ‌టం. అవును.. మహారాష్ట్రలో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పోటీచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ పేరు ప్ర‌క‌టించిన త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేయ‌డానికి కేసీఆర్‌కు సరైన అవ‌కాశం, స‌మ‌యం దొర‌క‌లేదు. అందుకే మ‌హారాష్ట్రపై క‌న్నేసారు. అంతేకాదు.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ లేదా కాంగ్రెస్ గెలిచాక‌.. జేడీఎస్ గెలిచిన పార్టీతో పొత్తులు పెట్టుకోబోంద‌ని తెలుస్తోంది. ఈ గొడ‌వ‌లో బీఆర్ ఎస్ ను ఇన్‌వాల్వ్ చేయ‌డం ఇష్టంలేకే కేసీఆర్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేయ‌లేద‌ని టాక్. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్, కాందార్ లోహా ప్రాంతాల్లో కేసీఆర్ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటుచేసారు. త్వ‌ర‌లో విదర్భాలోనూ ఓ మీటింగ్ పెట్ట‌నున్నారు. మ‌హారాష్ట్రలో జిల్లా ప‌రిష‌ద్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పోటీ చేయాల‌ని చూస్తోంది. 34 ప‌రిష‌ద్‌ల‌లో క‌నీసం 12 సీట్లైనా కైవ‌లం చేసుకునేలా ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.