KCR: తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్

KCR to attend telangana assembly sessions

KCR:  తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి.. BRS అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న గ‌ళం వినిపించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయాక ఇక కేసీఆర్ అసెంబ్లీకి రారు అనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు త‌న మ‌న‌సు మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.